logo
Updated : 30/11/2021 06:16 IST

సంక్షిప్త వార్తలు

నీతి అయోగ్‌ బృందం రాక

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రెండ్రోజులపాటు నీతిఅయోగ్‌ బృందం పర్యటించనుంది. ఇందులో భాగంగా నీతిఅయోగ్‌ ఉపాధ్యక్షుడు డా.రాజీవ్‌ కుమార్‌ బృందం బుధవారం ఉదయం 8 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోనుంది. అనంతరం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో బత్తుల సతీష్‌రెడ్డి అనే రైతు రెండున్నర ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న వరిని సందర్శిస్తారు. అనంతరం గ్రామ రైతు భరోసాతో పాటు సచివాలయాన్ని పరిశీలించి రైతులు, పొదుపు సంఘాల మహిళలతో సమావేశమవుతారు. ఈ బృందంలో ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వరరావు, అడ్వైజర్‌ నీలం పటేల్‌, అవినాష్‌మిశ్రా, సీహెచ్‌.పి.సారథిరెడ్డి, సుజిత్‌జైన్‌, మన్‌ప్రీత్‌కౌర్‌ సభ్యులుగా ఉన్నారు. పర్యటన ఏర్పాట్లను సోమవారం జేసీ శివశంకర్‌ వీరపనేనిగూడెం పర్యటించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.


కేఆర్‌యూ పరీక్షా ఫలితాల విడుదల

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: కృష్ణా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలకు చెందిన వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను సోమవారం విడుదల చేశారు. పీజీ నాల్గో సెమిస్టర్‌ మూడో విడత, బీఫార్మసీ మొదటి సెమిస్టర్‌, ఎంఫార్మసీ మొదటి, ఎంబీఏ/ఎంసీఏ నాలుగు, ఎంసీఏ ఆరు సెమిస్టర్ల ఫలితాలను వెల్లడించారు. బీటెక్‌ 3/5/7, పీజీ రెండో సెమిస్ట్టర్‌ రీవాల్యుయేషన్‌ ఫలితాలను కూడా ప్రకటించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. డి.రామశేఖరరెడ్డి తెలిపారు. పునఃమూల్యాంకనం చేసుకోదల్చిన వారు వెబ్‌సైట్‌లో పొందుపర్చిన మేరకు రుసుము చెల్లించి సూచించిన తేదీల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫలితాలతో పాటు ఇతర వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.


పాల వెల్లువతో మహిళలకు జీవనోపాధి

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జగనన్న పాల వెల్లువ పథకం మహిళల జీవనోపాధికి ఉపకరిస్తుందని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. ఎంపీడీవోలు, జిల్లా మానిటరింగ్‌ కమిటీ సభ్యులు తదితరులకు సోమవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తొలి విడతలో 300 గ్రామాల్లో పథకం అమలు చేయడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జేసీలు కె.మాధవీలత, ఎల్‌.శివశంకర్‌, మోహన్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, జేడీలు విద్యాసాగర్‌, టి.మోహన్‌రావు, డీపీవో జ్యోతి, పీఆర్‌ ఎస్‌ఈ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.


గృహాల రిజిస్ట్రేషన్లకు చర్యలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలులో సోమవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సమీక్షించారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉన్న విషయాన్ని, పథకం వల్ల కలిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాలన్నారు. నిర్దేశిత సమయంలోగా లబ్ధిదారుల గృహాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జి.రాజకుమారి, అనుపమ అంజలి, డీఆర్‌వో పి.కొండయ్య, ప్రత్యేక ఉప కలెక్టర్‌ లలిత, గృహనిర్మాణ శాఖ సంస్థ పీడీ బసవయ్య తదితరులు పాల్గొన్నారు.


పింఛన్లకు రూ.136.65 కోట్లు విడుదల

జిల్లాపరిషత్తు(గుంటూరు): జిల్లాలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకంలో లబ్ధిదారులకు పింఛన్‌ అందజేసేందుకు ప్రభుత్వం రూ.136.65 కోట్లు విడుదల చేసింది. నవంబరులో 5,87,839 మందికి పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీరికి డిసెంబరు 1 నుంచి పింఛన్‌ సొమ్ము పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్ల ఖాతాల్లో జమయిన నిధులను బ్యాంకుల నుంచి డ్రా చేసి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్దుబాటు చేస్తున్నారు.

ప్రత్తిపాడు మండల ఏవో సస్పెన్షన్‌

కలెక్టరేట్‌(గుంటూరు): ప్రత్తిపాడు మండల వ్యవసాయాధికారి సీహెచ్‌.విజయరాజును సస్పెండ్‌ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. సస్పెన్షన్‌ ఉత్తర్వును సదరు ఏవోకు అందించారు. ఇటీవల ప్రత్తిపాడు మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో నీమ్‌ ఆయిల్‌ను అనధికారికంగా విక్రయాలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నిర్వహించిన విచారణలో వాస్తవాలు బయటకు రావడంతో వీఏఏలపై ఇప్పటికే చర్యలు చేపట్టారు. మండల వ్యవసాయాధికారిపై చర్యలకు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు జిల్లా కలెక్టర్‌ సిఫార్సు చేయడంతో సదరు ఏవోను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


జాగ్రత్తలతోనే మాతృ మరణాల నివారణ

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో మాతృ మరణాలను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్‌ సూచించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో సోమవారం సాయంత్రం నవంబరు నెలలో సంభవించిన రెండు మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిపుణులు మాట్లాడుతూ ప్రసవ సమయంలో మహిళలు మరణించడానికి గల కారణాలను అధ్యయనం చేసి తెలుసుకున్న అంశాల ఆధారంగా మరణాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం లోతైన విశ్లేషణ అవసరమన్నారు. సమావేశంలో ఏడీఎంహెచ్‌వో జయసింహ, ఆచార్య వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని