logo
Published : 30/11/2021 04:52 IST

కట్టేదే లే..!

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: చెత్తపన్ను(యూజర్‌ ఛార్జీలు)కు కౌన్సిల్‌ ఆమోదం తెలపడంతో జూన్‌ నెల నుంచి మోడల్‌ డివిజన్లలో, అక్టోబరు నుంచి మిగిలిన డివిజన్లలో కట్టాలంటూ ప్రజలపై ప్రజారోగ్యవిభాగం అధికారులు, వార్డుసచివాలయ శానిటరీ సెక్రటరీలు, వాలంటీర్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కనీసంగా జూన్‌, జులై నెలలకు సంబంధించినవి అయినా చెల్లించాలని సచివాలయ సిబ్బంది నిత్యం ఇంటింటికీ తిరుగుతున్నారు. వాట్సాప్‌ మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

స్థానికంగా తీర్మానాలు.. నగరంలోని పలు ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లోని సంఘాలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని అసోసియేషన్లు, కాలనీసంఘాలు, ప్రజాసంఘాలు తాము చెత్తపన్ను చెల్లింపులు చేయలేమంటూ తీర్మానాలు చేస్తున్నారు. ఆయా చోట్ల చెత్తను సేకరించబోమని పారిశుద్ధ్య కార్మికులు, వార్డుసచివాయల సిబ్బంది భీష్మిస్తున్నారు.

అక్కడ 10 శాతం.. ఇక్కడ 40 శాతం.. నోటిఫైడ్‌ స్లమ్‌ ఏరియాలు, కొండ ప్రాంతాలు (మురికివాడల ప్రాంతాల్లో) 71.99 వేల కుటుంబాలు ఉండగా, అటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం 30 శాతం నుంచి 40 శాతం మేరకు చెత్తపన్ను వసూలు అవుతోంది. ప్రతి కుటుంబం నుంచి నెలకు రూ.30 చొప్పున తప్పని స్థితిలో చెల్తిస్తున్నారు. మిగిలిన నివాసేతర, ఫోష్‌, వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లోని కుటుంబాలు 2.44 లక్షలు ఉండగా, అక్కడ 10 శాతానికి మించి చెత్తపన్ను వసూలు కావడంలేదు. సిబ్బంది నుంచి ఒత్తిడి అధికంగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లోని వారు తప్పని స్థితిల్లో చెత్తపన్ను చెల్లిస్తున్నారు. ప్రధానంగా ఎంపిక చేసిన 6 మోడల్‌ డివిజన్లలో జూన్‌ నుంచి 6 నెలలకు సంబంధించిన చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4, 10, మధ్యలో 27, 36, పశ్చిమంలో 39,42 డివిజన్లలో ఈ పరిస్థితి ఉంది. మిగిలిన డివిజన్లలో అక్టోబర్‌, నవంబరు నెలలకు సంబంధించి 2 నెలల పన్ను కట్టమంటున్నారు. దీనిపై మోడల్‌ డివిజన్లలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

చెత్తపన్ను వసూళ్లు కొంత కష్టంగా ఉందని సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ అంగీకరించారు.


* ఆస్తిపన్నులోనే యూజర్‌ ఛార్జీలు కలిసి ఉంటాయి. అయినా కొత్తగా, అదనంగా చెత్త పేరిట వసూలు చేయడం సరైన విధానం కాదు. అదనపు ఆదాయం కోసం ప్రజల రక్తం పిండుతున్నారు. ప్రజలు కట్టబోమని చెబితే చెత్త తీసుకెళ్లబోమని వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది బెదిరించి వసూలు చేస్తున్నారు. ఈవిధానం సరైంది కాదు.

- నెలిబండ్ల బాలస్వామి, తెదేపా ఫ్లోర్‌లీడర్‌


* బలవంతపు చెత్తపున్ను విధింపు, వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏమాత్రం ప్రజలపై గౌరవం ఉన్నా ప్రజాబ్యాలెట్‌ నిర్వహించాలి. చెత్తసేకరణ విధానాన్ని భవిష్యత్తులో ప్రైవేటు పరం చేసేందుకే దీనిని ప్రస్తుతం అమలు చేస్తున్నారు. స్థానిక సంస్థలు ప్రజలకు సేవచేయాలేకానీ, వ్యాపార సంస్థలుగా మారకూడదు.

- బోయి సత్యబాబు, సీపీఎం ఫ్లోర్‌లీడర్‌


* చెత్తపన్ను విధించడం రాజ్యాంగ విరుద్దం. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం చెత్తసేకరించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థదే. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజలు చెల్లించే పన్నుల నుంచే చెత్తసేకరణ చేయాలి. పన్ను చెల్లించకపోతే చెత్త తీసుకెళ్లబోమని బెదిస్తున్నారు. ఫలితంతా అంటురోగాలు ప్రబలి ప్రజారోగ్యం దెబ్బతింటంది.

- ఆంజనేయులు, టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని