logo
Published : 30/11/2021 04:52 IST

4, 5 తేదీల్లో గాలులతో కూడిన వర్షాలు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్న క్రమంలో జిల్లాకు మళ్లీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావం వల్ల డిసెంబరు 4, 5 తేదీల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, సుమారు 100 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొన్నారు. కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంటలను డిసెంబరు 3లోగా కోసి వేయాలన్నారు. ఆ తర్వాత వర్షాలు పడే సమయంలో కోతలు నిలిపివేయాలని రైతులకు సూచించారు. కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉందని, ముఖ్యంగా తీరంలోని గ్రామాల వారు, జిల్లాలోని తోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల వద్దని కలెక్టర్‌ సూచించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని