logo
Published : 28/11/2021 03:38 IST

‘జాతీయ ఆహార భద్రతా చట్టానికి ఏపీ తూట్లు’

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : జాతీయ ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అఖిల భారత రేషన్‌ డీలర్ల సంఘం కార్యదర్శి బిశ్వంబర బసు ధ్వజమెత్తారు. ప్రజా పంపిణీలో డీలర్ల పాత్రను నామమాత్రం చేస్తూ ప్రవేశపెట్టిన మొబైల్‌ డిస్పెన్సింగ్‌ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం విజయవాడలో జాతీయ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీలోని నాలుగు రేషన్‌ డీలర్ల సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.  రేషన్‌ పంపిణీలో ఎండీయూ అనే మూడో వ్యవస్థను ప్రవేశపెట్టి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా పంపిణీలో 70శాతం ఖర్చును కేంద్రం భరిస్తుండగా, స్వల్ప ఖర్చులు భరించే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీలర్‌ వ్యవస్థను నామమాత్రం చేయడం దారుణమన్నారు. కమీషన్‌తో పాటు డీలర్‌కు వచ్చే గోనె సంచులను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోందని, ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.  రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందాడి వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. డిసెంబరు 10న అన్ని జిల్లాల్లో రేషన్‌ డీలర్లతో సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తామని, 17న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిరాజు, కోశాధికారి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని