logo
Published : 28/11/2021 03:10 IST

భూముల్లో ప్రవేశిస్తే అడ్డుకుంటాం

రూ.6 కోట్ల పరిహారానికి రైతుల వినతి

సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల ప్రతినిధులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఉండవల్లి కొండవీటి వాగు ఎత్తిపోతల నుంచి కృష్ణా కుడి కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తమ భూముల్లోకి అనుమతి లేకుండా ప్రవేశిస్తే అడ్డుకుంటామని రైతులు ప్రభుత్వానికి తెలిపారు. నగరంలోని విలీన గ్రామం ఉండవల్లిలోని రామాలయ కల్యాణ మండపంలో శనివారం కరకట్ట రోడ్డు విస్తరణ పరిధి భూములకు చెందిన అన్నదాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రూ.150 కోట్లతో 15.52 కి.మీ. మేర కృష్ణా కుడి కరకట్ట పటిష్ఠతతో పాటు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనుందన్నారు. కరకట్ట వెంబడి ఉండవల్లి, పెనుమాక పరిధిలో తాము భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. రహదారికి సుముఖంగా ఉన్నా, కట్ట విస్తరణలో 5.80 మీటర్లు ఎత్తు పెరుగుతున్నందున, దిగువ భూముల్లోకి తాము వెళ్లేందుకు మార్గం లేకుండా పోతుందన్నారు. కట్టకు దిగువ సర్వీసు రోడ్డులో తమ అవసరాల దృష్ట్యా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్డు విస్తరణకు భూమి ఇస్తామని, ఎకరాకు రూ.6 కోట్లు పరిహారం చెల్లించాలని కోరారు. ఉండవల్లిలో సీఆర్డీయే ఏర్పాటు చేసిన గ్రీన్‌జోన్‌ ఎత్తివేయాలని, ఆయా భూములను తమ అవసరాలకు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. తమ సందేహాలతో పాటు రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలపై పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్చించాలని, అప్పటివరకు భూముల్లోకి ప్రవేశిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఐదుగురు కర్షకులతో కూడిన కమిటీని సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో పాల్గొన్న వారిలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జొన్నా శివశంకరరావు, కౌలు రైతు సంఘం డివిజన్‌ నాయకులు కొర్రప్రోలు ఈశ్వరరెడ్డి, మండల నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్‌ కన్నారావునాయుడు, హైకోర్టు న్యాయవాది సురేష్‌కుమార్‌, కృష్ణా జిల్లా కోర్టు న్యాయవాధి శ్రీనివాసరావు, పలువురు కర్షకులున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని