తాగడానికి నీళ్లు అడిగి.. సామూహిక అత్యాచారం..!

 మొన్న హాథ్రాస్‌ హత్యాకాండ, నిన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 50 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మధ్యప్రదేశ్‌లో 45 ఏళ్ల మహిళపై నలుగురు అకృత్యానికి ఒడిగట్టారు.  పశువాంఛతో సామూహిత అత్యాచారానికి పాల్పడటంతో పాటు  అత్యంత దారుణంగా మహిళ శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించారు.  మధ్యప్రదేశ్‌లోని సింధి జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

Updated : 12 Jan 2021 04:11 IST

మహిళ శరీర భాగంలోకి రాడ్డు దించి..  ఎంపీలో ఘాతుకం..

సింధి, మధ్యప్రదేశ్‌:  మొన్న హాథ్రాస్‌ హత్యాకాండ, నిన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 50 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మధ్యప్రదేశ్‌లో 45 ఏళ్ల మహిళపై నలుగురు అకృత్యానికి ఒడిగట్టారు. పశువాంఛతో సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు  అత్యంత దారుణంగా మహిళ శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించారు.  మధ్యప్రదేశ్‌లోని సింధి జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులు,  సోదరితో కలిసి హార్ది గ్రామానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ఉంటోంది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ మహిళ జీవనోపాధి కోసం తన సోదరితో కలిసి ఓ షాపు నడుపుతోంది.  ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు ఆమె షాపునకు వచ్చి తాగడానికి నీళ్లు కావాలి అని అడిగారు.. దీనికి బదులుగా బాధితురాలు నీళ్లు లేవు అని సమాధానమిచ్చింది. దీంతో ఆగ్రహించిన నిందితులు మహిళ ఇంటిని ధ్వంసం చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై కిరాతకంగా ఆమె శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించి వెళ్లిపోయారు.  సంఘటన సమయంలో ఆమె ఇద్దరు కొడుకులు ఇంట్లో లేరు.  అనంతరం బాధితురాలని ఆమె చెల్లి ఆటో రిక్షాలో  ఆసుపత్రికి తీసుకెళ్లింది.  

మహిళ శరీర భాగాల్లోంచి రక్తం వస్తుండటంతో  మెరుగైన చికిత్స నిమిత్తం  పక్కనే ఉన్న రేవా జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు అమిలియా పోలీసు స్టేషన్‌ ఇన్‌ఛార్జీ దీపక్‌ బెహగల్‌ చెప్పారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఈ అమానుష ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా స్పందిస్తూ.. నలుగురు నిందితులు అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 

ఇవీ చదవండి..

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు.. ముగ్గురి అరెస్టు

రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి దారుణ హత్య

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని