Viral video: ఫోన్‌ మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడిన మహిళ

చంటి బిడ్డతో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. ఫరీదాబాద్‌లోని జవహార్‌ కాలనీలో ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహిళ మ్యాన్‌హోల్‌లో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు....

Published : 16 Oct 2021 01:54 IST

ఫరీదాబాద్‌: చంటి బిడ్డతో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడిన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. ఫరీదాబాద్‌లోని జవహార్‌ కాలనీలో ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహిళ మ్యాన్‌హోల్‌లో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అందులోకి దిగి బిడ్డను, మహిళను సురక్షితంగా బయటకు తీశారు. అయితే ప్రమాదానికి ముందు ఆ మహిళ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు సీసీ టీవీలో కనిపిస్తోంది. ఫోన్‌ సంభాషణలో నిమగ్నమై మ్యాన్‌హోల్‌ను చూసుకోనందువల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని