Sexual Harassment:  అమ్మాయిలపై వేధింపులను అడ్డుకున్న మహిళాపోలీస్‌పై వేధింపులు

అమ్మాయిల్ని వేధించొద్దని వారించిన మహిళా పోలీస్‌పైనే ఆకతాయిలు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పసుంపన్‌ ముత్తురామలింగ తేవార్‌ జయంతి సందర్భంగా నందనంలో పలు కార్యక్రమాలు

Published : 02 Nov 2021 01:53 IST

చెన్నై: అమ్మాయిల్ని వేధించొద్దని వారించిన మహిళా పోలీస్‌పైనే ఆకతాయిలు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు.  ముత్తురామలింగ తేవార్‌ జయంతి సందర్భంగా నందనంలో పలు కార్యక్రమాలు జరిగాయి. 24 ఏళ్ల మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఈ కార్యక్రమానికి బందోబస్తు విధులకు హాజరయింది. కాగా.. జనసందోహంలో ఇద్దరు ఆకతాయిలు అమ్మాయిల్ని వేధించడం గమనించిన ఆమె.. వారిని వారించింది. అయినా వారి ఆగడాలు ఆగలేదు. దీంతో వారిని మరోసారి హెచ్చరించబోయిన కానిస్టేబుల్‌పై ఆ ఇద్దరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఊహించని ఈ ఘటన పట్ల ఆగ్రహానికి గురైన ఆమె.. ఈ విషయాన్ని అక్కడే విధుల్లో ఉన్న తోటి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారిద్దరినీ పోలీసులు జనాల మధ్యలో నుంచి బయటకు లాగి.. స్థానిక పోలీసులకు అప్పగించారు. మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని