కుప్పకూలిన విమానం.. పైలట్‌ మృతి!

శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్..

Published : 22 Sep 2020 01:55 IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌ జిల్లా కుష్వాపురవా గ్రామ సమీపంలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందాడు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. ఈ విమానం శబ్ధం చేస్తూ కిందపడినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రమాదంలో  విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఘటన అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో శకలాలను తొలగించి పైలట్ మృతదేహాన్ని బయటకు తీశారు. దాన్ని శిక్షణ విమానంగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారంతోపాటు, విమానం ఏ శిక్షణ సంస్థకు చెందినదో తెలియాల్సి ఉందని సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్ వాగిష్‌ శుక్లా తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని