పోలీసు ఇంట్లోనే దొంగతనం.. క్షమించండంటూ లేఖ

నా మిత్రుడిని కాపాడుకునేందుకే ఇలా

Published : 07 Jul 2021 01:24 IST

 ‘సారీ ఫ్రెండ్‌.. మీ డబ్బు మళ్లీ తిరిగిఇచ్చేస్తా’ అంటూ వివరణ 

బిండ్‌: ఓ దొంగ.. దొంగతనానికి వెళ్తే చప్పుడు చేయకుండా ఇంటి నుంచి ఆభరణాలు, నగలు లాక్కొచేస్తాడు. కానీ ఈ దొంగ అలాంటోడు కాదు. తనకు కావాల్సింది ఇంటి నుంచి దోచుకోవడమే కాకుండా వెళ్తూ వెళ్తూ ఓ లేఖ రాశాడు. ‘‘ సారీ ఫ్రెండ్‌.. నన్ను క్షమించండి. ఇదంతా పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చింది. నా మిత్రుడి ప్రాణాలు కాపాడుకునేందుకే నేనీ దొంగతనం చేశా. మళ్లీ నాకు డబ్బు రాగానే మీదగ్గర దోచుకుంది తిరిగి ఇచ్చేస్తానంటూ’’ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాడు. ఇదంతా సామాన్య ప్రజల ఇంట్లో జరగలేదు. ఓ మధ్యప్రదేశ్‌లోని బిండ్‌ నగరానికి చెందిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌ స్టెక్టర్‌ కమలేష్‌ కఠారీ ఇంట్లో జరగడం మరో ట్విస్ట్‌. గత బుధవారం కమలేష్‌ భార్యా, పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం రాత్రి తిరిగొచ్చారు. ఆసమయంలో తలుపులన్నీ తెరిచి ఉండటం, ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడిఉండటంతో పాటు పక్కనే ఈ ఉత్తరం కనిపించింది. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన బిండ్‌ పోలీసులు ఇదంతా కమలేష్‌ సమీప బంధువులే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని