Updated : 27/09/2021 09:24 IST

HYD: మణికొండలో గల్లంతైంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

హైదరాబాద్‌: నగరంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్‌ (42)గా గుర్తించారు. ఘటనాస్థలానికి 50 మీటర్ల దూరంలోనే అతడి ఇల్లు ఉంది. షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్‌.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. వర్షపు నీటితో నిండి దారి కనిపించకపోవడంతో గుంతలో పడ్డారు. రజనీకాంత్‌ కోసం 2 డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్‌ చెరువు వద్ద గాలింపు కొనసాగిస్తున్నారు.

ఘటన బాధాకరం: మంత్రి సబిత

మణికొండలో ఘటనాస్థలిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఘటన చాలా బాధాకరమన్నారు. నిర్మాణాల వద్ద జాగ్రత్తలు పాటించాల్సి ఉందని.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకుంటామని సబిత తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని