Crime News: డ్రగ్స్‌ కేసులో షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ అరెస్ట్‌

ఓ రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగించారనే కారణంగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌.సి.బి) బాలీవుడ్‌ ప్రముఖ హీరో షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ని అరెస్ట్‌ చేసింది.

Updated : 03 Oct 2021 20:58 IST

ముంబయి: ఓ రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగించారనే కారణంగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌.సి.బి) బాలీవుడ్‌ ప్రముఖ హీరో షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ని అరెస్ట్‌ చేసింది. ఆదివారం ఉదయం నుంచి ఆర్యన్‌ని సుదీర్ఘంగా విచారించిన ఎన్సీబీ తాజాగా ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది. ఆర్యన్‌తోపాటు మరికొందరిని ఎన్సీబీ అరెస్ట్‌ చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీరిని ఓ ఆస్పత్రికి తరలించారు. ముంబయి నగరం శివారులోని తీరప్రాంతంలో కార్డెలియా క్రూజ్‌ ఎంప్రెస్‌ నౌకపై రేవ్‌ పార్టీ జరుతుందన్న విషయం తెలుసుకున్న ఎన్సీబీ అధికారులు శనివారం దాడులు జరిపారు. వారంతా మాదకద్రవ్యాల్ని వినియోగిస్తున్నట్టు గుర్తించారు. అధిక మొత్తంలో కొకైన్‌, గంజాయి, ఎండీఎంఏ వంటి వాటని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు. విచారణ ముగిసిన అనంతరం అరెస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని