AP News: వరద నీటిలో చిక్కుకున్న వాహనం.. వివాహిత మృతి

భారీ వర్షానికి రైల్వే అండర్‌ బ్రిడ్జి నీటితో నిండిపోయింది. అయినా డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు నడపడంతో నీట మునిగి ఓ యువతి మృతి చెందింది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు సమీపంలోని ముదుగళ్‌కు చెందిన భాగ్యశ్రీ రెండో కుమార్తె సంధ్య(28)కు హరీష్‌తో రెండేళ్ల కిందట వివాహమైంది. భాగ్యశ్రీ తన కుటుంబ సభ్యులతో...

Updated : 24 Oct 2021 15:05 IST

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: భారీ వర్షానికి రైల్వే అండర్‌ బ్రిడ్జి నీటితో నిండిపోయింది. అయినా డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు నడపడంతో నీట మునిగి ఓ యువతి మృతి చెందింది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు సమీపంలోని ముదుగళ్‌కు చెందిన భాగ్యశ్రీ రెండో కుమార్తె సంధ్య(28)కు హరీష్‌తో రెండేళ్ల కిందట వివాహమైంది. భాగ్యశ్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. పెద్ద కుమార్తె సువర్ణ, అల్లుడు వినోద్‌కుమార్‌, మనవరాలు విన్మయి, రెండోకుమార్తె సంధ్య, అల్లుడితో పాటు మూడో కుమార్తె సౌమ్య, కుమారుడు సుజిత్‌తో కలిసి వాహనంలో కంచి నుంచి తిరుపతి చేరుకున్నారు. డ్రైవర్‌ హనుమంతు గూగుల్‌ మ్యాప్‌ చూసుకుంటూ తిరుపతి వెస్ట్‌ చర్చి సమీపంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్దకు శుక్రవారం రాత్రి   12.50 గంటలకువచ్చారు. కుండపోత వర్షానికి వంతెన కింద భారీగా నీరుచేరింది. వాహనంఆపేయమని భాగ్యశ్రీ చెబుతున్నా.. డ్రైవరు ముందుకు పోనిచ్చాడు. ఇంజిన్‌లోకి నీరు చేరడంతో వాహనం ఆగిపోయింది. వరద ఉద్ధృతి పెరిగి వాహనం నీట మునిగింది. అక్కడున్న నలుగురు యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ నందకిషోర్‌ బృందం, బ్లూకోల్ట్స్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యువకులతో పాటు పోలీసులు వాహనంలో ఉన్న భాగ్యశ్రీ చీరను వాహనానికి కట్టమని సూచించి.. మరోవైపు వారుపట్టుకుంటూ డ్రైవర్‌తో పాటు ఏడుగురిని సురక్షితంగా బయటకు తీశారు. చిన్నారి విన్మయి స్పృహ కోల్పోయి.. అనంతరం కోలుకుంది. వాహనం వెనుక సీట్లో ఉన్న సంధ్య తేరుకుని డోర్‌ తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. వాహనంలో చిక్కుకున్న ఆమెను బయటకు తీసి రుయాకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని