Mydukur: పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ కుటుంబం ఆవేదన.. వీడియో వైరల్‌

కడప జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

Updated : 11 Sep 2021 17:45 IST

మైదుకూరు: కడప జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. కడప జిల్లా దువ్వూరు మండలంలోని తమ 1.5 ఎకరాల భూమిని ఆక్రమించిన స్థానిక వైకాపా నాయకుడు తిరుపాల్‌రెడ్డి.. మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డితో కలిసి బెదిరిస్తున్నారని కుటుంబం విలపించింది. వారికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. తాను కూడా వైకాపా కార్యకర్తనే అన్న దువ్వూరు మండలం ఎర్రబల్లెకు చెందిన అక్బర్‌ బాషా.. న్యాయం చేయాల్సిన పోలీసులు, ప్రజా ప్రతినిధులు దౌర్జన్యం చేస్తుంటే దిక్కు లేని వాడిగా మిగిలిపోయానని తీవ్ర ఆవేదన చెందారు.

జీవనాధారమైన పొలాన్ని ఆక్రమించారని.. తనకు న్యాయం చేయాలని సీఎం జగన్‌ను, డీజీపి గౌతమ్‌ సవాంగ్‌ను వేడుకున్నారు. లేని పక్షంలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమంటూ సెల్ఫీ వీడియోలో అక్బర్‌బాషా  ఆవేదన వ్యక్తం చేశారు. అక్బర్‌ బాషా కుటుంబం పోలీసుల సంరక్షణలో ఉన్నారని.. జిల్లా ఎస్పీ విచారణ జరిపి న్యాయం చేస్తారని కడప పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారు దువ్వూరు నుంచి కడపకు బయలుదేరినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని