Suicide: శిశువుకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. ఆపై బావిలో దూకి ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక మగ శిశువుకు జన్మనిచ్చి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాకు చెందిన మైనర్ బాలిక (16) మంగళవారం
గాంధారి: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక మగ శిశువుకు జన్మనిచ్చి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాకు చెందిన మైనర్ బాలిక (16) మంగళవారం మగశిశువుకు జన్మనిచ్చింది. అర్ధరాత్రి సమయంలో ముళ్ల పొదల్లో శిశువును వదిలేసి సమీపంలోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఐసీడీఎస్ అధికారులు.. ముళ్లపొదల్లో ఉన్న శిశువును రక్షించి అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బావి నుంచి మైనర్ బాలిక మృతదేహాన్ని బయటకు తీసి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆత్మహత్య నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పెళ్లికాకుండానే తల్లి కావడంతోనే మనస్తాపంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్‌ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు