WhatsApp: 5వ తరగతి విద్యార్థుల వాట్సప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియో లింక్‌

మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఐదో తరగతి విద్యార్థుల వాట్సప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియో లింక్‌ షేర్‌ చేశాడు. దీంతో విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. లింక్‌ను షేర్‌ చేసిన కృపాకర్‌ చతుర్వేదిపై

Updated : 24 Nov 2021 07:52 IST

మధ్యప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడి నిర్వాకం

ధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఐదో తరగతి విద్యార్థుల వాట్సప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియో లింక్‌ షేర్‌ చేశాడు. దీంతో విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. లింక్‌ను షేర్‌ చేసిన కృపాకర్‌ చతుర్వేదిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఐదో తరగతి వాట్సప్‌ గ్రూప్‌లో జిల్లాలోని 28 పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు 65 మంది మహిళా టీచర్లు సభ్యులుగా ఉన్నారు. కృపాకర్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు 30మంది ఉన్నారు. పోర్న్‌ వీడియో లింక్‌ షేర్‌ చేసిన కృపాకర్‌ కాసేపటికే దాన్ని తొలగించాడు. పొరపాటున తాను తప్పు చేశానని, మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటానని సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. గ్రూప్‌లోని మరో సభ్యుడు చెప్పేవరకు లింక్‌ షేర్‌ చేసిన విషయం తనకు తెలియదన్నాడు. కృపాకర్‌ ఇలా చేయడం కొత్తేం కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి లింక్‌లు షేర్‌ చేశాడని గ్రూప్‌లోని ఓ టీచర్‌ ఆరోపించారు. అతడిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కృపాకర్‌పై  ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని