Crime News: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య

నగరంలోని గచ్చిబౌలి పరిధిలో ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. శతాబ్ది (32) అనే యువతి తన ఫ్లాట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శతాబ్ది గది నుంచి

Published : 02 Dec 2021 01:24 IST

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి పరిధిలో ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. శతాబ్ది (32) అనే యువతి తన ఫ్లాట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శతాబ్ది గది నుంచి దుర్వాసన రావడంతో గమనించిన సహచరులు అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీకి సమాచారం అందించారు. గదిలోకి వెళ్లి చూడగా శతాబ్ది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శతాబ్ది ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని