Crime news: శిల్పా చౌదరికి బెయిల్ నిరాకరణ

మహిళలకు మాయమాటలు చెప్పి వారికి అధిక వడ్డీ ఆశచూపి రూ.కోట్లు కాజేసిన శిల్పాచౌదరికి ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఈ మోసం కేసులో ఆమె భర్త శ్రీనివాస్‌

Updated : 02 Dec 2021 15:43 IST

హైదరాబాద్‌: మహిళలకు మాయమాటలు చెప్పి వారికి అధిక వడ్డీ ఆశచూపి రూ.కోట్లు కాజేసిన శిల్పాచౌదరికి ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఈ మోసం కేసులో ఆమె భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం..  శిల్పా చౌదరిని ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ గురువారం ఆదేశాలు జారీచేసింది. అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రూ.7కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదంటూ శిల్పా చౌదరిపై పలువురు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని