ATM: ఏటీఎంలో రూ.65 లక్షల చోరీ.. కర్నూలు జిల్లా డోన్‌లో ఘటన

కర్నూలు జిల్లా డోన్‌లో పోలీసు స్టేషన్‌, డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎంలో దొంగలు బీభత్సం సృష్టించారు.

Updated : 31 Aug 2021 08:25 IST

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా డోన్‌లో పోలీసు స్టేషన్‌, డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి ఏటీఎంలోకి చొరబడి రూ.65 లక్షలకుపైగా దోచుకున్నారు. నెహ్రూనగర్‌ ప్రధాన రహదారిలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం యంత్రాలను గ్యాస్‌ కట్టర్‌, గడ్డపారతో ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బ్యాంకు అధికారులు ఏటీఎంను పరిశీలించారు. రాత్రి 2.56 గంటలప్పుడు ఈ సంఘటన జరిగినట్లు అంచనా వేశారు. శని, ఆది, సోమవారాలు బ్యాంకులకు సెలవు కావడంతో ముందస్తుగా శుక్రవారం రెండు ఏటీఎం యంత్రాల్లో రూ.85 లక్షలు పెట్టినట్లు, రూ.65,61,900 చోరీకి గురైనట్లు తెలిపారు. ఏటీఎం బయట ఉన్న సీసీటీవీని పగుల గొట్టి, లోపల ఉన్న కెమెరాను పక్కకు తిప్పిన తీరును బట్టి అనుభవమున్న దొంగలే ఈ చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని