Crime News: దారుణం.. 15 ఏళ్ల బాలుడికి ఇలాంటి ఆలోచనా..!

15 ఏళ్ల వయసు.. ఇంకా పాఠశాల కూడా దాటని ప్రాయం. చదువు, ఆటలు, పోటీ పరీక్షలు, ఏ కాలేజ్‌లో చేరాలి.. ఇవే కదా ఆ వయసువారి ఆలోచనలు. కానీ కేరళకు చెందిన ఓ బాలుడు ప్రవర్తించిన తీరు మాత్రం నివ్వెరపరుస్తోంది. అతడిని ఆ పరిస్థితికి పురికొల్పిన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Published : 29 Oct 2021 02:09 IST

21 ఏళ్ల యువతిపై అత్యాచార యత్నం

తిరువనంతపురం: 15 ఏళ్ల వయసులో కేరళకు చెందిన ఓ బాలుడు ప్రవర్తించిన తీరు నివ్వెరపరుస్తోంది. అతడిని పురికొల్పిన పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మలప్పురం జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు.. 21 ఏళ్ల యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకొంది. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలు కంప్యూటర్ క్లాస్‌కు వెళ్తున్న విషయాన్ని గమనించిన నిందితుడు ఆమెను అనుసరించాడు. ఆ సమయంలో పెద్దగా జనసంచారం కూడా లేదు. అదే అదునుగా చూసి, ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లాడు. ఆమె తలపై రాయితో కొట్టి, చేతుల్ని దుప్పట్టాతో కట్టేశాడు. ఆ తర్వాత ఆమె గొంతు నొక్కి.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించి సమీపంలోని ఇంటికి పరిగెత్తింది. 

ఈ ఘటనపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపర్చారు. అనంతరం జువైనల్ హోంకు తరలించారు. ‘మేం ఆ యువతితో మాట్లాడాం. అంతకు ముందు ఎప్పుడూ అతడిని చూడలేదని చెప్పింది. మేం సేకరించిన సమాచారం ఆధారంగా అతడిని ప్రశ్నించనున్నాం’ అని వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలు షాక్‌లో ఉండటంతో పూర్తి వివరాలు చెప్పలేకపోతోందన్నారు. మరోపక్క, ఆ బాలుడికి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని