Crime news: రూ. 30 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

దేశ రాజధాని దిల్లీలో భారీఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.సుమారు రూ.30 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను సరఫరా చేసే అంతర్జాతీయ ముఠాను

Published : 13 Sep 2021 01:25 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.30 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను సరఫరా చేసే అంతర్జాతీయ ముఠాను దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. సరఫరా చేస్తున్న వారిలో ఒక నైజీరియన్‌తో సహా ఇద్దర్నిపట్టుకున్నారు. వీరి నుంచి 17 కిలోల మాదకద్రవ్యాలతోపాటు ఓ కారును, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని