కుక్కలను చంపిన వ్యక్తిపై రూ.50 వేల రివార్డు

శునకాలను కిరాతకంగా హతమార్చిన గుర్తుతెలియని వ్యక్తిపై పీపుల్‌ ఆఫ్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఆనిమల్స్‌ (పెటా) చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిందితుడి సమాచారం అందించిన వారికి రూ.50 వేల రివార్డు ప్రకటించింది....

Updated : 11 Feb 2021 04:32 IST

​​​​​​​

భోపాల్‌: శునకాలను కిరాతకంగా హతమార్చిన గుర్తుతెలియని వ్యక్తిపై పీపుల్‌ ఆఫ్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఆనిమల్స్‌ (పెటా) చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిందితుడి సమాచారం అందించిన వారికి రూ.50 వేల రివార్డు ప్రకటించింది. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని మందసర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి 9 శునకాలను చంపి వాటికి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న పెటా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడి గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ నేపథ్యంలోనే స్పందించిన పెటా అతడి వివరాలు తెలియజేస్తే రూ.50 వేల రివార్డు అందిస్తామని ప్రకటించింది.

ఇవీ చదవండి...

కళ్లలో కారం.. ఒంటిపై వేడి నూనె

బుల్లితెర నటుడు అమర్‌ అరెస్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని