Crime news: మగబిడ్డ కోసం ఎనిమిదిసార్లు అబార్షన్‌.. 1500కు పైగా స్టెరాయిడ్‌లు!

ఆడపిల్లలు అనేక రంగాల్లో సత్తా చాటుతూ తమదైన ముద్ర వేస్తున్న కాలం ఇది. అమ్మాయి పుడితే అదృష్టంగా భావించేవారెందరో ఉన్నారు. కానీ.. కొందరిలో.........

Updated : 18 Aug 2021 01:49 IST

మగబిడ్డే కావాలంటూ భార్యకు వేధింపులు

ముంబయి: ఆడపిల్లలు అనేక రంగాల్లో సత్తా చాటుతూ తమదైన ముద్ర వేస్తున్న కాలం ఇది. అమ్మాయి పుడితే అదృష్టంగా భావించేవారెందరో ఉన్నారు. కానీ.. కొందరిలో మాత్రం నేటికీ మార్పు రావడం లేదు. అందుకు ఇదిగో.. ఈ ఘటనే ఒక ఉదాహరణ. తనకు మగ బిడ్డ కావాలంటూ భార్యకు ఎనిమిదిసార్లు అబార్షన్‌ చేయించాడో వ్యక్తి. ఈ క్రమంలో ఆమెకు వందల సంఖ్యలో హార్మోన్లు, స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు వేయించాడు. ఈ దారుణ సంఘటన ముంబయిలోని దాదర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు (40) తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. 

బ్యాంకాక్‌కు తీసుకెళ్లి మరీ..

ఓ తండ్రి తన కుమార్తె 2007లో పెళ్లి చేసి సంపన్న, విద్యాధిక కుటుంబంలోకి పంపారు. కొన్నాళ్లకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. 2009లో ఆమె ఆడశిశువుకు జన్మనివ్వగా.. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ భర్త అబార్షన్‌ చేయించాడు. మరోవైపు తానూ చికిత్స చేయించుకోవడం మొదలుపెట్టాడు. ప్రీ ఇంప్లాంటేషన్‌, లింగ నిర్ధారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఎనిమిది సార్లు గర్భస్రావం చేయించాడు. చికిత్స, ఆయా పరీక్షల సమయంలో ఆమెకు 1,500కుపైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు. మరోవైపు వేధింపులు పెరిగిపోతుండటంతో తట్టుకోలేక విసిగివేసారిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని