Crime: నా గర్ల్‌ఫ్రెండ్‌కి ఇంగ్లిష్‌ రాదు.. అందుకే మారువేషంలో పరీక్ష రాస్తున్నా

ప్రేమలో పడి చదువుని నిర్లక్ష్యం చేసిన వాళ్లని చూసుంటారు.పరీక్షలు ఎగ్గొట్టి తిరిగిన జంటల గురించి వినే ఉంటారు. మరి ప్రేమ ‘మారువేష’ పరీక్ష గురించి విన్నారా ఎప్పుడైనా.. తన గర్ల్‌ఫ్రెండ్‌ కోసం అమ్మాయి మారువేషం వేసుకొని పరీక్ష హాల్‌లో అడ్డంగా దొరికిపోయాడో ఓ యువకుడు. చివరికి ఇద్దరూ కటకటాలపాలై ఊసలు లెక్కపెడుతున్నారు. ఇదంతా ఈశాన్య ఆఫ్రికా దేశంలోని డైయోర్బెల్ అనే పట్టణంలో తాజాగా జరిగింది.

Published : 10 Aug 2021 02:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమలో పడి చదువుని నిర్లక్ష్యం చేసిన వాళ్లని చూసుంటారు.పరీక్షలు ఎగ్గొట్టి తిరిగిన జంటల గురించి వినే ఉంటారు. మరి ప్రేమ ‘మారువేష’ పరీక్ష గురించి విన్నారా ఎప్పుడైనా.. తన గర్ల్‌ఫ్రెండ్‌ కోసం అమ్మాయి మారువేషం వేసుకొని పరీక్ష హాల్‌లో అడ్డంగా దొరికిపోయాడో ఓ యువకుడు. చివరికి ఇద్దరూ కటకటాలపాలై ఊచలు లెక్కపెడుతున్నారు. ఇదంతా సెనెగల్‌లోని డైయోర్బెల్ అనే పట్టణంలో తాజాగా జరిగింది. విషయానికొస్తే.. అతడి పేరు ఖాదీం(22).. తన గర్ల్‌ఫ్రెండ్‌ గంగూ(19)కి హై స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంగ్లిష్‌లో అంతగా పట్టులేని గంగూ ఎలాగైనా పరీక్షల్లో పాస్‌ కావాలని తన బాయ్‌ఫ్రెండ్‌ను తనలా రెడీ చేసింది. ఇందుకు పొడువైన జట్టున్న విగ్‌, చెవిరింగులు, మేకప్, డ్రెస్‌తో పాటు ముఖాన్ని కప్పిపుచ్చేందుకు తలపై సంప్రదాయ స్కార్ఫ్‌తో రెడీ చేసింది. గంగూ చెప్పిన విధానాన్ని అలానే అనుసరిస్తూ.. మూడు రోజులు ఎవరికి అనుమానం రాకుండా.. ఎవరి కంటా పడకుండా.. అందరినీ మాయచేస్తూ వచ్చాడు ఖాదీం. ఇలా మూడు రోజుల వరకూ వారి ఆటలు సాఫీగానే సాగాయి. ఇక నాలుగో రోజు పరీక్ష అప్పుడు పరీక్ష హాల్‌కి వచ్చిన ఇన్విజిలేటర్‌కి ఖాదీం కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే అతడి గురించి పై అధికారులకు సమాచారమిచ్చారు. ఆపై వారు పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వెంటనే పరీక్ష హాల్‌కు చేరుకొని ముందుగా ఖాదీంను డీటైన్‌ చేశారు. తరువాత ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేయగా.. తాను ఇలా చేయడానికి కారణం తన గర్ల్‌ఫ్రెండ్‌ అని, ఆమెకు ఇంగ్లిష్‌ రాకపోవడంతో ఎలాగైనా తను పరీక్షల్లో పాస్‌ చేయాలనే ఉద్దేశంతో ఆమె చెప్పినట్టు చేశానని తప్పుని ఒప్పుకున్నాడు ఖాదీం.  అనంతరం ఉన్నతాధికారులు వారిని రెండేళ్ల పాటు ఎటువంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. న్యాయస్థానం ఇద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని