TS News: ఖాతాదారుల వ్యక్తిగత ఖాతాలు హ్యాక్‌ కాలేదు: మహేశ్‌ బ్యాంకు డీజీఎం

సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు సెలవు రోజుల్లో సర్వర్‌ను హ్యాక్‌ చేశారని మహేశ్‌ బ్యాంకు డీజీఎం బద్రినాథ్‌ తెలిపారు. హ్యాకింగ్‌ను గుర్తించగానే పోలీసులకు

Published : 26 Jan 2022 01:57 IST

హైదరాబాద్: సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు సెలవు రోజుల్లో సర్వర్‌ను హ్యాక్‌ చేశారని మహేశ్‌ బ్యాంకు డీజీఎం బద్రినాథ్‌ తెలిపారు. హ్యాకింగ్‌ను గుర్తించగానే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు వేగంగా స్పందించి కొన్ని ఖాతాలను బ్లాక్‌ చేశారని బద్రినాథ్‌ మీడియాకు వివరించారు. సైబర్‌ నేరగాళ్లు రూ.12కోట్లు ఇతర ఖాతాలకు బదిలీ చేశారన్నారు. ఖాతాదారుల వ్యక్తిగత ఖాతాలు హ్యాక్‌ కాలేదని తెలిపారు. తమ బ్యాంక్‌ ఖాతా నుంచి ఇతర బ్యాంకుల ఖాతాలకు నగదు వెళ్లిందని ఆయన చెప్పారు. సర్వర్‌ హ్యాక్‌ జరగటాన్ని ఐటీ నిపుణులు పరిశీలిస్తున్నారని బద్రినాథ్‌ వివరించారు.

బంజారాహిల్స్‌లోని మహేశ్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం సర్వర్‌లోకి చొరబడిన సైబర్‌ కేటుగాళ్లు నిన్న గంటల వ్యవధిలో రూ.12.90 కోట్ల నగదును కొట్టేశారు. ముగ్గురి ఖాతాల్లోకి ఆ నగదును బదిలీచేశారు. అక్కడి నుంచి దిల్లీ, బిహార్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్వేరు జాతీయ, కార్పొరేట్‌ బ్యాంకుల్లోని 128 ఖాతాలకు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని