ద్విచక్రవాహన చక్రంలో ఇరుక్కొని పసిబిడ్డ మృతి

ద్విచక్రవాహనం చక్రంలో ఇరుక్కొని రెండు నెలల పసికందు ప్రాణాలు పొగొట్టుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కోడుమూరు

Updated : 24 Jan 2022 05:32 IST

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం చక్రంలో ఇరుక్కొని రెండు నెలల పసికందు ప్రాణాలు పొగొట్టుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన మల్లికార్జున, సుహాసిని దంపతులు కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి రెండేళ్ల కుమార్తె, రెండు నెలల మగబిడ్డ రాముడు సంతానం. చిన్నారి రాముడికి జ్వరం రావటంతో చికిత్స నిమిత్తం మల్లికార్జున, సుహాసిని దంపతులు, ఆమె తమ్ముడు ఆదివారం ద్విచక్రవాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి గ్రామానికి చేరారు. ఇంటి ఎదుట సుహాసిని వాహనం దిగగానే బండి ముందుకు కదిలింది. బిడ్డ కోసం బేబీ కిట్‌లో చూడగా అందులో అతను లేడు. అందులోంచి జారి వాహనం వెనుకచక్రం, సైలెన్సర్‌ల మధ్య ఇరుక్కుపోయాడు. గుర్తించిన తల్లిదండ్రులు, స్థానికులు బిడ్డను బయటకు తీశారు. అప్పటికే అతను చనిపోయినట్లు గుర్తించారు. దాంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని