Crime News: చిన్నారిని అపహరించి.. నోట్లో తుపాకీ పెట్టి..!

నాలుగేళ్ల బాలుడిని అపహరించి కొట్టడమే గాక.. నోటిలో తుపాకీ పెట్టి బెదిరించాడో వ్యక్తి.

Published : 22 Nov 2021 13:38 IST

మొరాదాబాద్‌: నాలుగేళ్ల బాలుడిని అపహరించి కొట్టడమే గాక.. నోటిలో తుపాకీ పెట్టి బెదిరించాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లా దిలారి ప్రాంతంలోని ఇలార్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ‘‘గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి బాలుడిని కిడ్నాప్‌ చేశాడు. నాలుగేళ్ల చిన్నారిని నోరు తెరవాలని బెదిరించాడు. నోట్లో తుపాకీ పెట్టి, మంచం మీద పడేసి.. కొడుతున్న వీడియో వాట్సప్‌లో వచ్చింది. తల్లి లేని చిన్నారిని హింసించారు. పోలీసులు ఇది చాలా చిన్న కేసు అంటున్నారు. అందుకే ఎస్‌పీని కలిసేందుకు వచ్చా. బాలుడిని విడిపించకపోతే డీఐజీ కార్యాలయానికి కూడా వెళ్తా’’ అని చిన్నారి బంధువు విజేంద్ర పేర్కొన్నారు. వీడియోలోని మాటల ఆధారంగా బాలుడిని అపహరించింది అజిత్‌ అనే వ్యక్తిగా ఆరోపించారు. మరోవైపు.. గ్రామానికి చెందిన ఓ యువకుడు చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం అందిందని సీఐ అనూప్‌ కుమార్‌ తెలిపారు. నిందితుడు అజిత్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించినట్లు వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని