Kerala: మూఢనమ్మకాలకు 11 ఏళ్ల బాలిక బలి 

ఎంతటి రోగాన్నైనా నయం చేయగల స్థాయికి వైద్య రంగం అభివృద్ధి చెందినప్పటికీ.. నేటికీ కొందరు మూఢనమ్మకాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.

Published : 04 Nov 2021 11:38 IST

కన్నూర్‌: ఎంతటి రోగాన్నైనా నయం చేయగల స్థాయికి వైద్య రంగం అభివృద్ధి చెందినప్పటికీ.. నేటికీ కొందరు మూఢనమ్మకాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. ప్రార్థనలు, మంత్రాలతో నయమవుతుందని నమ్మి ఆ బాలిక మృతికి కారణమయ్యాడో తండ్రి. ఈ సంఘటన కేరళలోని కన్నూర్‌లో జరిగింది. కన్నూర్‌కు చెందిన ఎంఏ సత్తార్‌ కుమార్తె ఫాతిమా(11) కొద్ది రోజుల క్రితం తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురైంది. సత్తార్‌ తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మత గురువు ఉవాయిస్‌ దగ్గరికి తీసుకెళ్లాడు. మతపరమైన ప్రార్థనలు, క్షుద్రపూజలతో నయం చేయాలని కోరాడు. సరైన సమయంలో చికిత్స అందక ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సత్తార్‌తో పాటు మత గురువును అరెస్ట్‌ చేశారు. బాలిక తీవ్రమైన శ్వాసకోస వ్యాధితో బాధపడుతోందని, సరైన సమయంలో ఆసుపత్రిలో చికిత్స అందించి ఉంటే బతికేదని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని