వీడియోకాల్‌లోనే భర్త అంత్యక్రియలు

లాక్‌డౌన్‌ కారణంగా భర్త అంత్యక్రియలకు భార్య హాజరుకాలేకపోయింది. రవాణా వ్యవస్థ లేకపోవడంతో కడసారి చూపులకు నోచుకోలేకపోయింది. వీడియోకాల్‌లోనే అంతిమ సంస్కారాలు వీక్షిస్తూ...

Published : 19 Apr 2020 00:53 IST

ముంబయి: లాక్‌డౌన్‌ కారణంగా భర్త అంత్యక్రియలకు భార్య హాజరుకాలేకపోయింది. రవాణా సదుపాయం లేకపోవడంతో కడసారి చూపులకు నోచుకోలేకపోయింది. వీడియోకాల్‌లోనే అంతిమ సంస్కారాలు వీక్షిస్తూ ఆమె కన్నీరు మున్నీరయ్యింది. మహారాష్ట్రలో జరిగిన ఈ హృదయవిదారకర సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంతి బందేకర్, చంద్రకాంత్‌ మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలోని మోర్లె గ్రామంలో నివాసం ఉండేవారు. అయితే చంద్రకాంత్‌ మార్చి 22న ముంబయిలో ఉంటున్న తన కుమారుడు అమిత్ దగ్గరికి వెళ్లాడు.

అయితే చంద్రకాంత్ అనారోగ్యంగా ఉండటంతో అమిత్‌ ఆసుప్రతికి తీసుకెళ్లాడు. అతడు క్యాన్సర్ చివరి దశలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. తన తల్లి స్వస్థలంలో ఉండటంతో ఈ విషయాన్ని ఆమెకి చెప్పలేదు. అనారోగ్యంతో చంద్రకాంత్‌ ఏప్రిల్‌ 16న మరణించాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా సదుపాయం లేకపోవడంతో 490 కి.మీ. దూరంలో ఉన్న సొంతూరుకి తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లలేకపోయానని, అలాగే తల్లిని ముంబయికి రప్పించలేకపోయానని అమిత్ వాపోయాడు. దీంతో వీడియోకాల్‌లోనే అంతిమ సంస్కారాలు చూసేందుకు ఏర్పాట్లు చేశానని చెప్పాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని