అంకిత్‌ శర్మ శరీరంపై 51గాయాలు..!

దిల్లీ: ఈశాన్య దిల్లీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిఘా విభాగం(ఐబీ)అధికారి అంకిత్‌శర్మ శరీరంపై 51చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వీటిలో 12చోట్ల పదునైన కత్తులతో చేసిన గాయలుకాగా మరో 33చోట్ల ఆయుధాలు, రాడ్లతో చేసిన గాయాలున్నట్లు నివేదిక పేర్కొంది.

Published : 15 Mar 2020 01:40 IST

దిల్లీ: ఈశాన్య దిల్లీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిఘా విభాగం(ఐబీ)అధికారి అంకిత్‌శర్మ శరీరంపై 51చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వీటిలో 12చోట్ల పదునైన కత్తులతో చేసిన గాయలుకాగా మరో 33చోట్ల ఆయుధాలు, రాడ్లతో చేసిన గాయాలున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ గాయాలన్నీ అంకిత్‌శర్మ మరణించే కొంతసమయం ముందే అయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. గత ఫిబ్రవరి 27న దిల్లీలోని చాంద్‌బాగ్‌ ప్రాంతంలో ఓ నాలాలో అంకిత్‌ శర్మ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే, అత్యంతదారుణంగా జరిగిన ఈ హత్యలో స్థానిక నేత తాహిర్‌ హుస్సేన్‌ హస్తం ఉందంటూ అంకిత్‌శర్మ కుటుంబీకులు చేసిన ఫిర్యాదుపై దిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో తాహిర్‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని