కేకు తినే పోటీల్లో విషాదం!

ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఓ తినుబండారాల పోటీలో విషాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా డే వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కేక్‌ తినే పోటీల్లో పాల్గొన్న ఓ మహిళ తింటూనే మృత్యువాత పడ్డారు.

Updated : 28 Jan 2020 01:52 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఓ తినుబండారాల పోటీలో విషాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా డే వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కేక్‌ తినే పోటీల్లో పాల్గొన్న ఓ మహిళ తింటూనే మృత్యువాత పడ్డారు. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. క్వీన్స్‌ల్యాండ్‌లోని బీచ్‌ హౌజ్‌ హోటల్‌ యాజమాన్యం ఆస్ట్రేలియా డే సందర్భంగా ‘కేక్‌ ఈటింగ్‌’ పోటీలను నిర్వహించింది. పోటీల్లో పాల్గొనే వారందరూ చాక్‌లేట్‌ కేకులను వేగంగా తినాలి. అందులో ఓ అరవయ్యేళ్ల మహిళ సైతం పాల్గొంది. ఆమె పోటీలో భాగంగా కేక్‌ తింటూనే అకస్మాత్తుగా మూర్చిల్లింది. వెంటనే హోటల్‌ సిబ్బంది కోస్టల్‌ టౌన్‌లోని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆమె మృతి పట్ల తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు హోటల్‌ యాజమాన్యం ప్రకటించింది. ఆమె మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు విచారణలో వెల్లడించారు. ఆస్ట్రేలియా డే రోజున ఆ దేశంలో ఏటా ఇలాంటి పోటీలు నిర్వహిస్తారు. గెలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని