Hyderabad : హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు.. టోనీకి 5 రోజుల కస్టడీ

మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు నైజీరియాకు చెందిన టోనీని నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ నెల 20న టోనిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా.. మరో 10 మంది నిందితులు...

Published : 27 Jan 2022 18:54 IST

హైదరాబాద్‌ : మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు నైజీరియాకు చెందిన టోనీని నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ నెల 20న టోనిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా.. మరో 10 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. శశికాంత్‌, గజేంద్రప్రకాశ్‌, సంజయ్‌, అలోక్‌ జైన్‌, ఆసిఫ్, షాహిద్‌, అఫ్తాబ్‌, రహమత్‌, ఇర్ఫాన్‌, ఫిర్దోస్‌పై  అభియోగాలు మోపారు.

మరోవైపు రిమాండ్‌ రిపోర్టు వివరాలను పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు టోనీ 2019 నుంచి డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు తెలిపారు. 2013లో టోనీ 3 నెలల పర్యటన వీసాపై భారత్‌కు వచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రారంభంలో విగ్గులు, వస్త్రాలు నైజీరియాకు ఎగుమతి చేసిన టోనీ.. డబ్బులు సరిపోకపోవడంతో డ్రగ్స్‌ సరఫరాను ఎంచుకున్నాడు. భారత్‌లోనే నైజీరియన్‌ అమ్మాయిని పెళ్లి చేసుకొని అంధేరీలో కాపురం పెట్టాడు. నైజీరియాకు చెందిన స్టార్‌ బాయ్‌ ఓడల ద్వారా ముంబయికి డ్రగ్స్‌ చేరవేసే వాడు. స్టార్‌ హోటళ్లు, ఈవెంట్లకు వెళ్లి, పరిచయాలు పెంచుకొని క్రమంగా ముంబయి, గోవా, హైదరాబాద్‌లో డ్రగ్స్‌ విక్రయాలు సాగించాడు. తన దగ్గర 13 మంది డ్రగ్స్‌ కొన్నట్లు పోలీసులకు టోనీ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని