Viral Video: టపాసులు పేలి తండ్రీకొడుకు మృతి.. వీడియో వైరల్‌!

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొట్టకుప్పంకు సమీపంలో టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కుమారుడు అక్కడికక్కడే మరణించారు. పుదుచ్చేరి లోని అరియన్‌కుప్పం ప్రాంతానికి చెందిన కలయని సన్‌ తన ఏడేళ్ల కుమారుడితో తమిళనాడులోని మరక్కణంలో బాణాసంచా కొనుగోలు చేయడానికి వచ్చాడు. రెండు బ్యాగుల టపాసుల...

Published : 06 Nov 2021 02:01 IST

చెన్నై: తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొట్టకుప్పంకు సమీపంలో టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కుమారుడు అక్కడికక్కడే మరణించారు. పుదుచ్చేరి లోని అరియన్‌కుప్పం ప్రాంతానికి చెందిన కలయని సన్‌ తన ఏడేళ్ల కుమారుడితో తమిళనాడులోని మరక్కణంలో బాణాసంచా కొనుగోలు చేయడానికి వచ్చాడు. రెండు బ్యాగుల టపాసులు కొనుక్కొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు టపాసులు ఒక్కసారిగా పేలాయి. భారీ పేలుడు కారణంగా ఘటనా స్థలిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందారు. రోడ్డుపై వారి వెనకాలే వెళ్తున్న మరో ఇద్దరికి కూడా పేలుడు దాటికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ లారీ సహా ఇతర వాహనాలు ఈ పేలుడు దాటికి పాక్షికంగా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. టపాసులు పేలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని