Crime: వైద్యురాలి గదిలో స్పై కెమెరాలు!

మహిళా ట్రైనీ డాక్టర్‌ గదిలో స్పై కెమెరాలు పెట్టిన నేరంలో సీనియర్‌ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ మెడికల్‌ కాలేజీలో 42 ఏళ్ల న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కాగా.. తన వద్ద ట్రైనీగా ఉన్న

Published : 14 Jul 2021 01:24 IST

ముంబయి: మహిళా ట్రైనీ డాక్టర్‌ గదిలో స్పై కెమెరాలు పెట్టిన నేరంలో సీనియర్‌ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ మెడికల్‌ కాలేజీలో ట్రైనీగా పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్‌ రెసిడెన్షియల్‌ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. కాగా.. ఇటీవల ఆమె ఇంట్లోని బాత్రూంలో బల్బు ఆన్‌ చేయబోతే వెలగలేదు. దీంతో ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి మరమ్మతు చేయిస్తున్న క్రమంలో అందులో స్పై కెమెరా ఉన్నట్లు గుర్తించారు. అలాగే, బెడ్‌రూంలో కూడా స్పై కెమెరా ఉండటం చూసి ట్రైనీ డాక్టర్‌ కంగుతిన్నారు. వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అందర్ని విచారించగా.. మెడికల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న 42 ఏళ్ల న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌పై అనుమానం వ్యక్తమైంది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని