HYD: ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

బంజారాహిల్స్‌లో ఉన్న కృష్ణానగర్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీకి ఓ దుండగుడు విఫలయత్నం చేశాడు. ఏటీఎం యంత్రం ధ్వంసం చేసేందుకు యత్నించాడు. అయితే యంత్రం తెరుచుకోకపోవడం సహా వెంటనే అలారం మోగడంతో వెనుదిరిగాడు....

Published : 08 May 2021 01:11 IST

కృష్ణానగర్‌: హైదరాబాద్‌ నగరంలో వరుస ఏటీఎం చోరీ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే కూకట్‌పల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏటీఎం వద్ద కాల్పులు జరిపిన దుండగులు రూ.5 లక్షలు చోరీ చేశారు. వారు జరిపిన కాల్పుల్లో ఓ భద్రతా సిబ్బంది మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం మేడ్చల్‌ జిల్లా గండిమైసమ్మ కూడలిలో ఉన్న ముతూట్‌ ఫైనాన్స్‌లో దుండగులు గోడకు కన్నం వేసి చోరీకి విఫలయత్నం చేశారు. అయితే అలారం మోగడంతో అక్కడి నుంచి పరారయ్యారు.

తాజాగా బంజారాహిల్స్‌లో ఉన్న కృష్ణానగర్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీకి ఓ దుండగుడు విఫలయత్నం చేశాడు. ఏటీఎం యంత్రం ధ్వంసం చేసేందుకు యత్నించాడు. అయితే యంత్రం తెరుచుకోకపోవడం సహా వెంటనే అలారం మోగడంతో వెనుదిరిగాడు. ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది చోరీ యంత్రం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని