Crime:మాటు వేసి.. బైక్‌ దొంగలించి!

అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గరనుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులో ద్విచక్ర వాహన చోరీలు అధికమయ్యాయి. తాజాగా బెంగళూరులోని ద్వారకానగర్‌లో ఓ డెలివరీ బాయ్‌కు చెందిన బైక్ చోరీకి గురైంది.

Updated : 24 Jun 2021 06:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గరనుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులో ద్విచక్ర వాహన చోరీలు అధికమయ్యాయి. తాజాగా బెంగళూరులోని ద్వారకానగర్‌లో ఓ డెలివరీ బాయ్‌కు చెందిన బైక్ చోరీకి గురైంది. అతడు ఓ ఇంటి ముందు ద్విచక్రవాహనాన్ని ఆపి ఇంట్లోకి వెళ్లాడు. ఇది గమనించిన ఓ దొంగ ఆ బైక్‌ను ఎత్తుకుపోయాడు. కాగా ఆ ద్విచక్రవాహనంలో లక్షరూపాయలు ఉన్నట్టు సమాచారం. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదుచేసిన గిరినగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని