Crime: డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారినే కిడ్నాప్‌ చేశాడు

 కారు ఆపి ధ్రువపత్రాలు చూపించమన్నందుకు ఏకంగా ట్రాఫిక్‌ పోలీస్‌నే ఓ ప్రబుద్ధుడు కిడ్నాప్‌ చేశాడు. కారులో పది కిలోమీటర్లు తిప్పి.. చివరికి ఎవరు లేని చోట వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. సినిమాల్లో చూపించే కిడ్నాప్‌ సీన్స్‌ను తలదనేల్లా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడాలో చోటు చేసుకుంది. 

Published : 20 Oct 2021 01:10 IST

తప్పించుకునే మార్గం లేక అరెస్టయ్యాడు

ఇంతకీ ఏం జరిగిందంటే

నొయిడా: కారు ఆపి ధ్రువపత్రాలు చూపించమన్నందుకు ఏకంగా ట్రాఫిక్‌ పోలీస్‌నే ఓ ప్రబుద్ధుడు కిడ్నాప్‌ చేశాడు. కారులో పది కిలోమీటర్లు తిప్పి.. చివరికి ఎవరు లేని చోట వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. సినిమాల్లో చూపించే కిడ్నాప్‌ సీన్స్‌ను తలదనేల్లా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల కిత్రం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ కారు షోరూమ్‌లో మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు కొనేందుకు నిందితుడు సచిన్‌ రావల్‌(29) వెళ్లాడు. టెస్ట్‌ డ్రైవ్‌కి వెళ్లొస్తా అని చెప్పి కారుతో సహా ఉడాయించాడు. అలా గ్రేటర్‌ నొయిడాలోని తన స్వగ్రామం ఘోడీ బచేడాకి చేరుకున్నాడు. కొత్తకారు కొన్నట్లు అందరికీ చెప్పుకున్నాడు. కారుకు ఓ నకిలీ నంబర్‌ ప్లేట్‌ని అమర్చుకున్నాడు. రెండు రోజుల క్రితం సుర్జాపుర్‌లో దొంగిలించిన కారులో రావల్‌ వెళుతున్నాడు. వాహన తనిఖీలో భాగంగా భాగంగా రావల్‌ కారును పోలీసులు ఆపారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌ సింగ్‌ వచ్చి డ్యాకుమెంట్స్‌ చూపించమని అడిగాడు. పత్రాలు లేవని, కారులో కూర్చుంటే మొబైల్ ఫొన్‌లో ఉన్న సాఫ్ట్‌కాపీ డాక్యుమెంట్స్‌ని చూపిస్తా అని నమ్మబలికాడు. కానిస్టేబుల్‌ కారు ఎక్కిన మరుక్షణం వెంటనే కారు లాక్‌ వేసేసి ముందుకు పోనిచ్చాడు. అలా 10 కి.మీ దాటాక ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ను రోడ్డు మీద వదిలేసి పారిపోయాడు. సోమవారం సుర్జాపుర్‌ పోలీసుస్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి నిందితుడిని అరెస్టు చేశారు. దొంగలించిన కారుని స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని