Updated : 26/10/2021 18:49 IST

Drugs Case: ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ముంబయి: క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు ఈ కేసు విచారణను కొనసాగించనున్నట్టు బాంబే హైకోర్టు తెలిపింది. దీంతో ఆర్యన్‌ ఈరోజు రాత్రికి కూడా ఆర్ధర్‌ రోడ్డులోని జైలులోనే ఉండనున్నారు. అక్టోబర్‌ 3న అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌.. దాదాపు రెండు వారాలకు పైగా జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఆర్యన్‌ ఖాన్‌ తరఫున మాజీ అటార్నీ జనరల్‌, ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, సతీశ్‌ మానెశిందే బాంబే హైకోర్టులో వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కుట్ర పూరితంగానే ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండానే ఆర్యన్‌ని అరెస్టు చేసి 20 రోజులకు పైగా జైలులో ఉంచారన్నారు. 

ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవన్నారు.  మరి అలాంటప్పుడు ఆర్యన్‌ ఏవిధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్‌ దొరికితే.. ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని ప్రశ్నించారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాల బెయిల్‌ పిటిషన్‌ పైనా రేపు విచారించనున్నట్టు తెలిపారు. ఎన్‌సీబీ తరఫున అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ కూడా తన వాదనలు వినిపించనున్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని