శ్రీలంక జైలులో అల్లర్లు.. 8 మంది ఖైదీల మృతి

శ్రీలంకలోని ఓ జైలులో అల్లర్లు చెలరేగిన ఘటనలో 8 మంది ఖైదీలు మరణించారు. జైలు సిబ్బంది సహా 37 మంది గాయపడ్డారు. శ్రీలంక రాజధాని కొలంబో సరిహద్దుల్లో ఉన్న....

Updated : 30 Nov 2020 16:18 IST

జైలు అధికారులను బంధించి పారిపోయేందుకు యత్నం

కొలంబో: శ్రీలంకలోని ఓ జైలులో అల్లర్లు చెలరేగిన ఘటనలో 8 మంది ఖైదీలు మరణించారు. జైలు సిబ్బంది సహా 37 మంది గాయపడ్డారు. శ్రీలంక రాజధాని కొలంబో సరిహద్దుల్లో ఉన్న మహారా జైలులోని కొందరు ఖైదీలు ఆదివారం అల్లర్లు సృష్టించారు. జైలు అధికారులను బంధించి తలుపులను తెరుచుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు. వంటశాలకు, రికార్డ్‌ రూమ్‌కు ఖైదీలు నిప్పంటించారు. తలుపులను బలవంతంగా తెరుస్తున్న క్రమంలో జైలు సిబ్బంది వారిని అడ్డుకున్నట్లు పోలీసు అధికారి అజిత్‌ రొహాన తెలిపారు.

ఖైదీలు సృష్టించిన విధ్వంసంతో జైలు పరిసరాలు అట్టుడికాయి. జైలు సిబ్బంది, ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది ఖైదీలు మృతిచెందారు. ఇద్దరు జైలర్లు సహా 35 మంది ఖైదీలు గాయపడినట్లు అజిత్‌ రొహానా వెల్లడించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

శ్రీలంక జైళ్లలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. పరిమితికి మించి ఖైదీలు ఉండటంతో అనేక మంది వైరస్‌ బారిన పడుతున్నారు. దీంతో పలు జైళ్లలో ఖైదీలు నిరసనకు దిగుతున్నారు. ప్రస్తుతం అల్లర్లు చెలరేగిన మహారా జైలులో 175 మంది వైరస్‌ బారిన పడినట్లు అజిత్‌ రొహానా పేర్కొన్నారు. 10 వేల మందికి మాత్రమే పరిమితి ఉన్న శ్రీలంక జైళ్లలో 26 వేల మంది ఖైదీలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని