మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది సజీవ దహనం

మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 07 Nov 2021 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ మెక్సికోలోని రహదారిపై టోల్‌బూత్ వద్ద ఆపిన వాహనాలపైకి.. ఓ రవాణా ట్రక్కు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో తొమ్మిది వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకుని 15 మంది సజీవ దహనమయ్యారు. ట్రక్కు బ్రేకులు విఫలం కావడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని