Financial planning: 40 ఏళ్ల వయసుకు కోటి రూపాయలు కూడబెట్టడం ఎలా..?
మదుపర్లు 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తే రిస్క్ సామర్థ్యాన్ని బట్టి 8 నుంచి 12 శాతం రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే 40 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.1 కోటి పొందాలన్న లక్ష్యంతో మదుపు చేసే వారు కాస్త రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌గా పెట్టుబడులు పెడితే అధిక రాబడి సాధించవచ్చని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి (సిప్) ద్వారా మదుపుచేస్తే కాంపౌండింగ్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల మదుపరులు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలం పాటు మదుపు చేస్తారు. అయితే ఇలా మదుపు చేసే వారిలో ఎంతమంది వారి ఆదాయం పెరిగినప్పుడు సిప్ మొత్తాన్ని పెంచుతున్నారనేది ముఖ్యం. వార్షిక ఆదాయం పెరిగినప్పుడల్లా సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోతే తక్కువ సమయంలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇందుకు క్రమశిక్షణ ఎంతో అవసరం.
ఎందులో మదుపు చేయాలి?
మదుపర్లు 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తే రిస్క్ సామర్థ్యాన్ని బట్టి 8 నుంచి 12 శాతం రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే 40 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.1 కోటి పొందాలన్న లక్ష్యంతో మదుపు చేసే వారు కాస్త రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఒక మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. రిస్క్ పరిమితిని బట్టి ఇండెక్స్ ఫండ్స్, మిడ్ కాప్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు.
స్టెప్-అప్ సిప్..
రూ.1 కోటి లక్ష్యంతో మదుపు ప్రారంభించిన వారు అనుకున్న సమయానికి తమ లక్ష్యానికి చేరువయ్యేందుకు సాధారణ మ్యూచువల్ ఫండ్ సిప్ సరిపోదు. ఇందుకోసం వార్షిక స్టెప్-అప్‌తో కూడిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలో 12 శాతం సగటు రాబడి ఆశించొచ్చు. అలాగే, కనీస నెలవారీ పెట్టుబడితో సిప్‌ను ప్రారంభించి లక్ష్యాన్ని సాధించేందుకు ఈ స్టెప్-అప్ విధానం మదుపరులకు సహాయపడుతుంది.
ఏటా ఎంత పెంచాలి?
మదుపరులు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే 40 ఏళ్ల వయసుకు 15 సంవత్సరాల సమయం ఉంటుంది. సాధారణంగా 10 శాతం వార్షిక స్టెప్-అప్ ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. కానీ, ఇక్కడ మదుపరి లక్ష్యం పెద్దది కాబట్టి వార్షిక స్టెప్ అప్ కనీసం 15 శాతం ఉండాలి.
ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఒక వ్యక్తి తన 25 సంవత్సరాల వయసులో సిప్ చేయడం ప్రారంభిస్తే, 12 శాతం వార్షిక రాబడి అంచనాతో 40 ఏళ్ల వయసుకు, అంటే తరువాతి 15 సంవత్సరాల్లో రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రారంభంలో నెలకు రూ.9,000 పెట్టుబడి పెట్టాలి. అనంతరం 15 శాతం వార్షిక స్టెప్-అప్ ఉండాలి. అప్పుడు అతడు/ఆమె మదుపు చేసిన మొత్తం రూ. 51,38,684, మొత్తం రాబడి రూ.50,96,594, మెచ్యూరిటీ మొత్తం రూ.1,02,35,278 అవుతుంది.
ఎలా ప్రారంభించాలి?
కొన్ని వెబ్సైట్లు/ యాప్‌లు ఈ ఆప్షన్ అందిస్తున్నాయి. మీరు నిర్దిష్ట స్టెప్ అప్ రేటు చెప్పినట్టయితే ప్రతి ఏడాది ఆ మేరకు సిప్ మొత్తాన్ని పెంచుతూ వెళ్తాయి. ఒకవేళ ఇలాంటి ఆప్షన్ మీరు మదుపు చేసిన వెబ్సైట్/ యాప్ వద్ద లేకపోతే మీరు ప్రతి ఏడాది మాన్యువల్‌గా పెంచుతూ వెళ్లొచ్చు. లేదంటే కొత్త సిప్ ప్రారంభించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట