క్యాండీక్రష్‌పై మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి

అమెరికాకు చెందిన వీడియోగేమ్‌ల తయారీ సంస్థ యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను 68.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5.15 లక్షల కోట్ల)తో కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ప్రసిద్ధ క్యాండీక్రష్‌ గేమ్‌ ఈ సంస్థదే. గత శుక్రవారం యాక్టివిజన్‌ కంపెనీ

Published : 19 Jan 2022 03:47 IST

రూ.5.15 లక్షల కోట్లతో   యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌కు కొనుగోలు ఆఫర్‌

మెరికాకు చెందిన వీడియోగేమ్‌ల తయారీ సంస్థ యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను 68.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5.15 లక్షల కోట్ల)తో కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ప్రసిద్ధ క్యాండీక్రష్‌ గేమ్‌ ఈ సంస్థదే. గత శుక్రవారం యాక్టివిజన్‌ కంపెనీ షేరు ముగింపు ధరతో పోలిస్తే 45 శాతం ప్రీమియంతో ఒక్కో షేరుకు 95 డాలర్లను మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌ చేసింది. ఆదాయ పరంగా మూడో అతి పెద్ద వీడియో గేమింగ్‌ కంపెనీ యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌. మైక్రోసాఫ్ట్‌ నుంచి కొనుగోలు ఆఫర్‌ రావడంతో ఈ కంపెనీ షేరు సోమవారం సుమారు 38 శాతం పెరిగి 65.39 డాలర్లకు చేరింది. మంగళవారం ట్రేడింగ్‌లోమరో 30 శాతం పెరిగి 85 శాతం డాలర్లకు చేరింది. కొవిడ్‌ పరిణామాల్లో, వినోదానికి సంబంధించి గేమింగ్‌ అనేది చాలా కీలకంగా మారిందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో అధికులు ఇంట్లో ఉండటంతో  వీడియో గేమ్‌లను ఎక్కువగా ఆడినట్లు తెలిపారు. యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసినా, ఆ సంస్థ సీఈఓగా బాబీ కోటిక్‌ కొనసాగుతారని సమాచారం.

మరో వీడియో గేమ్‌ పబ్లిషర్‌ అయిన టేక్‌-టు ఇంటరాక్టివ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంక్‌, ‘ఫార్మ్‌విల్లే’ సృష్టికర్త జింగాను 1,100 కోట్ల డాలర్ల నగదు, స్టాక్‌ ఒప్పందంతో కొనుగోలు చేయబోతున్నట్లు గతవారం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని