Bad Bank: బ్యాడ్‌ బ్యాంకుకు అన్ని అనుమతులులభించాయి: ఎస్‌బీఐ ఛైర్మన్‌

గత ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు లభించినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా తెలిపారు....

Updated : 28 Jan 2022 20:38 IST

ముంబయి: గత ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన బ్యాడ్‌ బ్యాంక్‌ (Bad Bank) ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు లభించినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా తెలిపారు. ఈ ‘జాతీయ ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ కంపెనీ లిమిటెడ్‌ (NARCL)’లో ప్రభుత్వ బ్యాంకులకు మెజారిటీ వాటా ఉండనుందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రయివేటు బ్యాంకులకు ‘భారత రుణ పరిష్కార కంపెనీ లిమిటెడ్‌ (IDRCL)’లో గణనీయ వాటాలు ఉంటాయని తెలిపారు.

తొలి దశలో 15 కేసులకు సంబంధించిన రూ.50,000 కోట్లు విలువ చేసే మొండి బకాయిలు బ్యాడ్‌ బ్యాంకు బదిలీ అవనున్నట్లు దినేశ్‌ కుమార్‌ వెల్లడించారు. మొత్తం రూ.రెండు లక్షల కోట్లు బ్యాడ్‌ బ్యాంకుకు బదిలీ చేసే ప్రణాళికలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు బదిలీ చేయదగిన 38 ఖాతాలను ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. ఈ మొండి బకాయిల విలువ రూ.83,000 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఎన్‌ఏఆర్‌సీఎల్‌ నిరర్థక ఆస్తుల్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోనుంది. వాటిని రాబట్టేందుకు కావాల్సిన పరిష్కార ప్రక్రియను ఐడీఆర్‌సీఎల్‌ చూసుకోనుంది. ఈ క్రమంలో ఏర్పడే పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం మొండి బకాయిల వసూలులో మెరుగైన పనితీరును కనబరచనుందని దినేశ్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని