Unemployment: భారత్‌లో 5.3 కోట్ల మంది నిరుద్యోగులు..!

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. చాలా సంస్థలు నష్టాలతో మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దేశంలో

Published : 20 Jan 2022 18:51 IST

దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. చాలా సంస్థలు నష్టాలతో మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరుగుతోంది. 2021 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా నిరుద్యోగుల సంఖ్య దాదాపు 2 కోట్ల వరకు ఉంది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 

ఇందులో 3.5కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తుండగా.. 1.7కోట్ల మంది మాత్రం జాబ్‌ చేయాలని ఉన్నా అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని సీఎంఐఈ తన నివేదికలో పేర్కొంది. ఇక ఉద్యోగ వేటలో ఉన్న వారిలో 23శాతం మంది (80లక్షల మంది) మహిళలు అని తెలిపింది. జాబ్ చేయాలని ఉన్నా.. అందుకు సరైన ప్రయత్నాలు చేయకుండా ఉన్నవారిలో 53శాతం మంది (90 లక్షల మంది) మహిళలే అని వెల్లడించింది. 

‘‘ఉద్యోగ వేటలో అంత యాక్టివ్‌గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. అందుకు ప్రధాన కారణం అవకాశాలు లేకపోవడం. చాలా చోట్ల కంపెనీలు మహిళలంటే వెనక్కి తగ్గుతున్నాయి. ఇక ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు సామాజికంగానూ ఎలాంటి సహకారం అందడం లేదు’’ అని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని