Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నాయి....

Published : 17 Jan 2022 09:39 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గతవారాన్ని మిశ్రమంగా ముగించాయి. చైనా నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు నిరుత్సాహపర్చడంతో నేడు ఆసియా సూచీలు మందకొడిగా ఉన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్ల పెంపు దిశగా వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు నిర్ణయం తీసుకుంటున్నాయి. కానీ, చైనా మాత్రం అందుకు భిన్నంగా స్వల్పశ్రేణి రుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇది నేడు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వారం రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి దిగ్గజ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. అలాగే నేడు ప్రధాని మోదీ ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’లో ప్రసంగించనున్నారు. ఇన్వెస్టర్లు దీనిపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 116 పాయింట్ల లాభంతో 61,339 వద్ద.. నిఫ్టీ (Nifty) 38 పాయింట్లు లాభపడి 18,294 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.13 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 సూచీలో హీరోమోటోకార్ప్‌, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, మారుతీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్ సిమెంట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, టైటన్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, సిప్లా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని