భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి........

Published : 26 Apr 2021 09:38 IST

ముంబయి: అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 591 పాయింట్ల లాభంతో 48,470 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 159 పాయింట్లు ఎగబాకి 14,501 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.80 వద్ద కొనసాగుతోంది. 

అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం సరైన మార్గంలోనే ఉందన్న నిపుణుల అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు తెచ్చిపెట్టాయి. కొంత కాలం క్రితం వరకు కరోనాతో కొట్టుమిట్టాడిన బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ అమెరికా కంటే వేగంగా పుంజుకునే అవకాశం ఉందన్న వార్తలు అంతర్జాతీయ సూచీల సెంటిమెంటును పెంచాయి. మరోవైపు దేశంలో కరోనా కల్లోలాన్ని తగ్గించేందుకు కేంద్రం వేగంగా చర్యలు చేపడుతుండడం మదుపర్లలో విశ్వాసం నింపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే, కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కలవరపెడుతున్న నేపథ్యంలో లాభాలు ఎంత మేర నిలబడతాయన్నది చూడాల్సి ఉంది.

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారత్‌ పెట్రోలియం కంపెనీల షేర్లు లాభాల్లో కదలాడుతుండగా.. మహీంద్రా అండ్‌ మహీంద్రా, బ్రిటానియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని