Unlock: అవసరమైనవే తెరవండి: సీఐఐ

కరోనా మూడో దశ ఉద్ధృతి పొంచి ఉన్న నేపథ్యంలో అన్‌లాక్‌ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అధ్యక్షుడు టి.వి.నరేంద్రన్‌ సూచించారు. సరఫరా గొలుసు వ్యవస్థను పునరుద్ధరించరించ......

Published : 20 Jun 2021 14:16 IST

దిల్లీ: కరోనా మూడో దశ ఉద్ధృతి పొంచి ఉన్న నేపథ్యంలో అన్‌లాక్‌ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అధ్యక్షుడు టి.వి.నరేంద్రన్‌ సూచించారు. సరఫరా గొలుసు వ్యవస్థను పునరుద్ధరించే కార్యకలాపాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. తద్వారా ఆర్థిక వృద్ధి ఊపందుకోవడంతో పాటు ప్రజలకు జీవనోపాధి లభిస్తుందన్నారు.

‘‘అన్నింటినీ తెరవడం కంటే, ఏ కార్యకలాపాలు అత్యవసరమో వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ అనేది తప్పనిసరి చేపట్టాల్సిన పని. అదే సామాజిక కార్యక్రమాలను అనుమతించేందుకు మరికొన్ని రోజులు వేచి ఉండొచ్చు. ముప్పును కొని తెచ్చుకోవడం ఎందుకు’’ అని నరేంద్రన్‌ వ్యాఖ్యానించారు. తొందరపడి అవసరం లేని వాటిని తెరవడం వల్ల కరోనా మూడో దశ విజృంభణ ప్రారంభవుతుందని అభిప్రాయపడ్డారు.

రెండో దశ కట్టడి కోసం రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్‌, మే నెలల్లో ఆర్థిక వ్యవస్థ పట్టు తప్పిందని నరేంద్రన్ తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో అది స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. రోజుకి కనీసం 71.2 లక్షల కరోనా టీకా డోసుల్ని పంపిణీ చేయాల్సిన  అవసరం ఉందని సూచించారు. అలా అయితేనే ఈ ఏడాది చివరి నాటికి దేశంలో ఉన్న వయోజనులందరికీ టీకాలు ఇవ్వగలమని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని