Maruti Suzuki Price Hike: పెరిగిన మారుతీ కార్ల ధరలు.. ఎంతంటే?

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మరోసారి ధరల్ని పెంచింది. వివిధ మోడళ్లపై 4.3 శాతం వరకు ధరల్ని పెంచినట్లు శనివారం ప్రకటించింది.....

Published : 16 Jan 2022 15:02 IST

దిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మరోసారి ధరల్ని పెంచింది. వివిధ మోడళ్లపై 4.3 శాతం వరకు ధరల్ని పెంచినట్లు శనివారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.

ధరల పెంపు మోడల్‌ను బట్టి 0.1-4.3శాతం మధ్య ఉందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. మారుతీ సుజుకీ ఆల్టో నుంచి ఎస్‌-క్రాస్‌ వరకు వివిధ మోడల్‌ కార్లను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ.3.15 లక్షల నుంచి రూ.12.56 లక్షల వరకు ఉంది. గత ఏడాది ఈ కంపెనీ మూడుసార్లు ధరల్ని పెంచింది. 2021 జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబరులో రూ.1.9 శాతం మేర ధరలు పెరిగాయి. మొత్తంగా గత ఏడాది మారుతీ కార్ల ధరలు 4.9 శాతం వరకు ఎగబాకాయి. ఈసారి ఒకే దఫాలో 4.3 శాతం వరకు పెంచడం గమనార్హం. ఉక్కు, అల్యూమినియం, రాగి సహా ఇతర కీలక లోహాలు, ప్లాస్టిక్‌ ధరలు పెరిగాయని.. దీంతో కార్ల ధరల పెంపు అనివార్యమని గత నెల కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని