Stock Market: మార్కెట్లలో కొనసాగుతున్న బేర్‌ పట్టు.. నష్టాల్లో సూచీలు

దేశీయ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల సెంటిమెంట్‌ను

Published : 20 Jan 2022 09:36 IST

ముంబయి: దేశీయ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో వరుసగా మూడో రోజు సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 18వేల దిగువన ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 256 పాయింట్లు కుంగి 59,843 వద్ద.. నిఫ్టీ 63 పాయింట్ల నష్టంతో 17,875 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు రాణిస్తుండగా.. ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే, సిప్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని