TTD: ఆ ఉద్యోగ ప్రకటనలను నమ్మి మోసపోవద్దు: తితిదే

తితిదేలో ఉద్యోగాల భర్తీ పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని తితిదే హెచ్చరించింది.

Updated : 06 Dec 2021 07:44 IST

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తితిదేలో ఉద్యోగాల భర్తీ పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని తితిదే హెచ్చరించింది. ‘ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసపూరిత మాటలు చెప్పి గతంలో కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. తితిదేలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేటప్పుడు ముందుగా పత్రికల్లో, తితిదే వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన విడుదల చేస్తాం. అవాస్తవ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని తితిదే స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని